ఆత్రేయ అనుభూతి
కొండూరు ఆత్రేయ రచించిన కవిత అనుభూతిని ప్రచురించాం, అవధరించండి.
అక్టోబరు నెల గడిని, సెప్టెంబరు గడి ఫలితాలనూ ప్రచురించాం, జొరబడండి.
ముక్కు శ్రీరాఘవ కిరణ్ రాసిన “ఉపజాతి పద్యాలు” వ్యాసాల శ్రేణిలో సీసపద్యం గురించి వివరించే మూడవ భాగాన్ని మీకు అందిస్తున్నాం.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో పొద్దు జరిపిన ఇంటర్వ్యూ రెండో భాగాన్ని ప్రచురించాం. చదివి మీ అభిప్రాయాలు తెలుపండి.
సమయానికి సెప్టెంబరు గడి అందుబాటులో లేక ప్రచురించలేక పోయాం. కొవ్వలి సత్యసాయి గారు అది సహించలేకపోయారు. వెంటనే ఓ గడి తయారు చేసి, దాన్ని ప్రచురించమని పంపించారు. వారికి పొద్దుపై గల అభిమానానికి నెనరులు తెలియజేసుకుంటూ, ఈ గడిని ప్రచురిస్తున్నాము. అక్టోబరు గడిని త్వరగా ప్రచురించి, గడిని మళ్ళీ గాడిలో పెట్టేందుకు గాను, ఈ గడికి గడువును అక్టోబరు 12 వ తేదీతో ముగిస్తున్నాం. కేవలం వారం రోజుల్లో పూర్తి చేసి పంపాలి కాబట్టి, ఇది మెరుపు గడి! సత్యసాయి గారు ఈ గడిలో మరో ప్రత్యేకతను కూర్చారు, పరిశీలించండి. ఈ గడిపై మీ అభిప్రాయాలను రాయండి.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో పొద్దు సంపాదకులు జరిపిన ఇంటర్వ్యూ మొదటి భాగాన్ని ప్రచురించాం, ఆస్వాదించండి.
అనివార్యమైన కారణాల వలన పొద్దులో ఈ నెల గడిని ప్రచురించలేకపోతున్నాం. వచ్చే నెల గడిని అక్టోబరు 13 న ప్రచురిస్తాము. గత నెల గడి ఫలితాలు వివరణలను ప్రచురించాం.
శ్రీవల్లీ రాధిక రచించిన కవిత కైవల్యం ప్రచురించాం, చూడండి.
ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో పొద్దు జరిపిన ఇంటర్వ్యూ గురించిన ప్రస్తావనా వ్యాసం కూడా చూడండి.
ముక్కు శ్రీరాఘవ కిరణ్ రాసిన “ఉపజాతి పద్యాలు” వ్యాసాల శ్రేణిలో తేటగీతి గురించి వివరించే రెండవ భాగాన్ని మీకు అందిస్తున్నాం.