పొద్దులో రా(సి)నారె!
అక్షరాలను దూసి
మలచి మాలగ జేసి
తెలుగుతల్లికి వేసి
ధన్యుడయ్యెను మనిషి!
(ఏంటో.. రానారెను తలిస్తేనే పద్యాలొస్తున్నాయి! పాదాలూ మాత్రలూ కూడా పెరిగిపోతున్నాయి.)
వచనమైనా నిర్వచనమైనా అలవోకగా రాసుకెళ్ళిపోయే రానారె, లాగులు తొడుక్కునే టప్పటి నుండీ రాస్తున్నాడు. లాగుల నాడైనా, బ్లాగుల నాడైనా అందరిలోకీ ఆతడే ముందు! పొద్దులో అతడి బ్లాగులపై సమీక్ష చూడండి!
———————–
రా(సి)నారె అనే ఈ జాబు శీర్షికను ఎక్కడి నుండి కొట్టుకొచ్చామో తెలిసిపోయింది కదా!
ఊరకనే తెచ్చుకున్నా, ఏమననందుకు వారికి మా నెనరులు!




February 19th, 2008 15:14
కొట్టుకొచ్చింది ఇక్కడ నుంచే ఐతే, నచ్చినందుకు, కొట్టుకొచ్చినందుకు సంతోషము.
March 5th, 2008 13:51
ఈ పన్నులూ, శ్లేషలూ దొరికే చోటొకటే.. vookadampudu.wordpress.com
మీ వ్యాఖ్యలు పరిశీలన కోసం ఉండిపోయాయి. ఇలా ఉన్నట్టు నాకేమో మెయిలు రాలేదు. అంచేత ఇన్నాళ్ళూ చూసుకోలేదు, సారీ! ఇప్పుడే చూసి, ఇదిగో..