తోటి పత్రికలు
సాటి వారి సమీక్ష అని వికీలో ఓ ముఖ్యమైన అంశముంది. మనం రాసిన దాన్ని మన తోటివారు సమీక్షిస్తారన్నమాట! పొద్దు అలాంటిదే ఓ పని చేసింది. సాటి పత్రికల గురించి రాసింది. అయితే ఇది సమీక్ష కాదుగానీ, ఓ పరిచయం అంతే! పోటీ ప్రపంచమిది.. ఒకరిని మించి ఒకరు దూసుకు, తోసుకు పోవాలనే ధోరణులున్న రోజులు! అలాంటిది, సాటి పత్రికల గురించి ఓ పత్రిక బొమ్మలతో సహా పరిచయ వ్యాసం రాయడమా!?
అవును, రాయడమే!!
ఈ వ్యాసం రాసేందుకు మేం చేసిన పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. అవన్నీ ఆ వ్యాస పరిధిలోవి కాదు కాబట్టి, రాయలేదు.
- వాటిలో ఒకటి.. కొన్ని పత్రికల వారికి ఒకరంటే ఒకరికి పడదు.
- మరోటి.. పొద్దు వచ్చాక, కొన్ని పత్రికల ధోరణిలో మార్పు వచ్చింది.
కుశాగ్రబుద్ధులైన పొద్దు పాఠకులు ఆ సంగతి గ్రహించే ఉంటారు.
పోతే, ఓ రెండు కొత్త సాంకేతికాలను పొద్దుకు జోడించాం. చూడండి.



