పూతరేకులాంటి కవితొకటి!
ఓహో, జి.ఎస్.నవీన్ ఈ మధ్య కవితలు రాయడం మొదలుపెట్టారనమాట అని అనుకున్నాం! భలే రాసారే అనీ అనుకున్నాం. అయితే, ఆ కవితా రచన ఇప్పుడు కాదు, చిరుత వయసులోనే మొదలెట్టారని మాకు తెలిసింది. కవితలే కాదు, కార్టూన్లూ వెయ్యగలరు, (గిత్తోడి) కథలూ చెప్పగలరు. సరే.., సాఫ్టువేరు కోడింగు, డీకోడింగు, బగ్గింగు, డీబగ్గింగుల సంగతి చెప్పేదేముంది!
అయితే ఈ సాఫ్టువేరు స్కిల్సును తన కంపెనీకి ఇచ్చేసి, సాఫ్టు స్కిల్సును మాత్రం దాచేసుకున్నారు. ఈ మధ్యే.. వెలికి తీయడం మొదలెట్టారు. ఆయన రాసిన మరో కవిత - “విరహ విలాపాలేలరా…” - ను ప్రచురించాం. ఇది కవిత కాదు, చక్కగా పాడుకోదగ్గ పాట అని పొద్దు సంపాదకవర్గ సభ్యుడన్నారు. చదవండి!
నవీన్ బహుముఖ ప్రజ్ఞను మరింతగా చూడగలమని ఆశిద్దాం.



