Archive for April, 2008

ఏప్రిల్ కదండీ..

వసంత ఋతువు కదండీ, ప్రకృతికి వసంతం చైత్రంతోనే వచ్చేసింది. కొన్ని రోజులు గడిచి ఎండలు ముదిరి గ్రీష్మం ఆర్భాటంగా ఫెళ ఫెళ మని అడుగిడుతుంటే కొంచం దిగులుగా ఉండే మాట నిజం. ఐతే మళ్ళీ సరికొత్త వసంత సౌరభాన్ని ఇప్పుడూ అస్వాదించాలనుకుంటే …. నిషిగంధ గారి తాజా కవితను చదవాల్సిందే.
~~~~~~~~~
వేసవి కదండీ, ఉక్కపోతగానే వుంటుంది.

ఈ యండల్లో లిరిల్ తాజాదనం మంచి రిలీఫ్ కదా!

అయితే ఏమిటంటారా?

కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ తాజాగా వుండే ఒక బ్లాగుంది.

ఈ నెల బ్లాగుసమీక్షలో ఆ తాజాదనాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఆస్వాదించండి.
~~~~~~~~~
మృతజీవులు ఏప్రిల్ భాగం ఇంకా ప్రచురించలేదు కదండీ.. అందుకే పదిహేడో భాగం ప్రచురించాం, చదవండి.

ఏడాదెక్కిన గడి

ఈ నెలతో గడి ఏడాది పూర్తిచేసుకొంది. ఏడాదిపాటు ఈ శీర్షిక విజయవంతంగా నడిచిందంటే, దానికి పాఠకులు చూపిన అనూహ్యమైనే ఆదరణే కారణం. గడిపై వ్యాఖ్యలు, స్లిప్పులూ, మాస్-కాపీయింగు, చమత్కారాలు అన్నిటితో ఇది గడి కాదు, బొమ్మల కొలువు అన్నట్టుగా మారిందంటే - దానికి కొత్తపాళీగారి లాటి విజ్ఞులైన పాఠకులే కారణం అని వేరే చెప్పనక్కరలేదు.

త్వరలోనే గడిరూపు రేఖలు మారనున్నాయి -ఒకేపేజీలో మెత్తం గడంతా ప్రింటవుటు తీసుకోడానికి వీలుగా, ఇంటర్ఫేసుని మారుస్తున్నాం.

కొవ్వలి సత్యసాయిగారు మొదటిసారి చేసిన గడి సులువుగా ఉందని అందరూ అన్నారు, అందుకేనేమో ఈసారి ప్రొఫెసరుగారు తన సత్తా ఎంటో చూపారు. అయినా, ఆయన మహిమేంటోగాని - ఈసారి కూడా వారి గడికి మంచి స్పందన వచ్చింది. ఈ నెల గడిని భైరవభట్ల కామేశ్వరరావుగారు సమర్పిస్తున్నారు.

భైరవభట్ల వారు గతంలో కూర్చిన గడికి బహుమతి కూడా ప్రకటించినప్పటికీ, వారా గడిని మరీ ఎత్తులో నిలబెట్టటం చేత బహుమతి అందలేదు. పైగా అప్పట్లో మా.కా. కూడా లేదాయెను. ఈ సారి ఆ సౌకర్యాలన్నీ అమరాయి కాబట్టి, మేం టీ తాగడానికి బయటకి పోతున్నాం, ఇహ మీ ఇష్టం..

సర్వధారికి ఆహ్వానం పలకండి

తెలుగు ప్రజలందరికీ సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు.

పొద్దు సంపాదకవర్గంలోకి కొత్తగా చేరిన స్వాతికుమారి గారు రాసిన ఉగాది సంపాదకీయం చదవండి.

షడ్రుచుల పండగ రోజున నవకవులు దత్త పదులతోటీ, పదకొండులతోటీ చేసిన సందడి గనండి. అభినవ భువనవిజయ వ్యాసాలన్నిటినీ చదవండి. భువన విజయం పద్యాలు చదివాక, ఆ స్ఫూర్తితో మీరూ పద్యాలు రాయండి. మీరూ సర్వధారికి ఆహ్వానం పలకండి, ఇలా..

సంపద కలుగంగ సంతతధారగ
సకలసుఖములీయ సర్వసాక్షి
సర్వ జనుల కిదియె పర్వదినముకాగ
సర్వధారికిమ్ము స్వాగతమ్ము

పదండి ముందుకు.. పదండి తోసుకు…

గడిపై అంతర్జాలంలో ప్రతిధ్వనిస్తున్న పురజనుల గుసగుసల హోరును గమనించి, వ్యవధిని ఓ వారం పాటు పెంచాలని నిర్ణయించాము.

కాపీలు కొట్టుకోడానికి ఇక ఏప్రిల్ 14 దాకా టైముందొహో!!!

అభినవ భువన విజయం

భట్టుమూర్తి అంటే ఎవరో చెప్పుకోండి చూద్దాం. అష్టదిగ్గజాల్లో ఒక కవి అని అనుకుంటున్నారా..

మరి విశ్వామిత్రుడంటే త్రిశంకు స్వర్గాన్ని సృష్టించిన బ్రహ్మర్షి అనీ.., వికటకవి అంటే తెనాలి రామకృష్ణ కవి అనీ గదా మీ ఉద్దేశ్యం!

అభినవ భువన విజయం సందర్భంగా వీటి అర్థాలు మారిపోయాయి. ఆ కథేమిటో ఇవాళ్టి అభినవ భువనవిజయము - అంతర్జాలములో అపూర్వ కవిసమ్మేళనము లో చూడండి.

సాకలైవోరు

మీరు ఇసుకలో అక్షరాలు దిద్దుకుని నేర్చుకున్నారా? పిండిలో ఓనమాలు కాదు.. అక్షరాలన్నీ! ఇసుకలోనే!!

పోనీ లాంతరు, బుడ్లు తీసుకుని ప్రైవేటుకెళ్ళి చదువుకున్నారా? లేదా.. మీకా అదృష్టం లేదన్న మాట! పోన్లెండి!

సాకలైవోర్లు, కోమటి పంతుళ్ళు, పొలిమేర బళ్ళు,… ఇవన్నీ పోయాయి. ఇప్పుడన్నీ కాన్వెంటులూ, నేషనల్, ఇంటర్నేషనల్ స్కూళ్ళే! ఏడో తరగతి నుండే ఎమ్‌సెట్లు, ఆరో తరగతి నుండి ఐఐటీలు.

రాయలసీమలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఓ రైతు..

ఆగండాగండి.. కాదు, ఆయన కాదు! వీరి పేరు ఆదినారాయణరెడ్డి!

ఆదినారాయణరెడ్డి గారు రైతు బిడ్డే కాదు రైతు కూడా! తాను ఎలా చదువుకున్నారో చెబుతున్నారాయన. పొద్దులో గతంలో అహం అనే వ్యాసం రాసారు కూడా! పదండి ఆదినారాయణరెడ్డి గారి సాకలైవోరు చదువెలా చెప్పారో తెలుసుకుందాం.

గడిలో తప్పిపోదలచిన వారి కోసం..!

కొవ్వలి సత్యసాయి గారు అల్లిన పదవ్యూహంలోకి జొరబడ్డారా?

కొందరు గడిని ఛేదించి ముందుకు దూసుకెళ్ళారట గానీ, తిరిగి బయటికొచ్చారో లేదో తెలియరాలేదు. వారిని బయటికి తెచ్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అభిజ్ఞవర్గాల భోగట్టా! ఈలోగా స్లిప్పులు అందించే కార్యక్రమాలు చెదురుమొదురుగా జరుగుతున్నట్టు వేగుల ద్వారా తెలుస్తోంది.

ఇహ మీ ఇష్టం!

ఏప్రిల్ 1 విడుదల!

పిచ్చిపుల్లయ్యల రోజున పిచ్చిపుల్లయ్యలైన వారందరికీ మా సానుభూతి (సహ అనుభూతి కూడా లెండి)! ఏంపర్లేదు, ఊరడిల్లండి.. కానివారి సంగతి మనం చూద్దాం!!

మార్చి నెల ఐపోయింది నిన్నే. ఏప్రిల్ 1 వచ్చిందీ ఇప్పుడే.. ఇంకా కొందరికి రాలేదు కూడా. అప్పుడే మార్చి నెల బ్లాగు టపాల జాబితా విడుదలైంది. వెంఠనే వెళ్ళి చూడండి. ఇదిగో ఇదే లింకు - http://poddu.net/?p=549. మీరు రాసిన జాబు కూడా ఉందేమో చూడండి.

ఆలసించిన ఆశాభంగం!

నేడే చూడండి.. మీ అభిమాన వెబ్ పత్రిక పొద్దులో.. విశ్వవిఖ్యాత.. ..