బ్లాగరులకో లేఖ

“నా మదిలో బోలెడు ఊసులు ఉన్నాయి. రాతలు-కోతలు ఎప్పుడూ ఉండేవే కదా! ఈసారికిలా రేగొడియాలు తింటూ సాలభంజికలు పాడే సరిగమలు విందాం” ఏమిటీ ‘ఈ మాటలు కొంచెం తేడాగా ఉన్నాయ్, దీనివెనుక బ్లాగరులను బ్లాగులు రాయనివ్వకుండా ఆపడానికి ఏదో….. గూడుపుఠాణీ ఉన్నట్ల’నిపిస్తోందా? అదేమిటో వెంటనే తట్టకపోతే మరీ అంత సీరియస్ గా ఆలోచించక వెంఠనే తూరుపు దిక్కుగా వెళ్లండి… అసలే రాన్రానూ పొద్దు ఒక సరదా పాడూ లేకుండా మరీ సీరియస్ పత్రికైపోతోందని పాఠకులు గునుస్తున్నారు. అందుకే మీలాంటి సరదా ప్రియులైన పాఠకులను అలరించడానికి ఈసారి బ్లాగరులకో లేఖతో సిద్ధంగా ఉన్నారు కొల్లూరి సోమశంకర్.