మేనెల గడెక్కింది

గడి సాధకుల బాధలేగాని, గడి కూర్పరుల సాధక బాధకాలు పట్టించుకోరా, మాకూ స్లిప్పులు కావాలి” అని మేం కొత్తపాళీగారి దగ్గర మారాం చేస్తే “దానికేం భాగ్యం, అలాగే కానివ్వండి” అంటూ ఆయన మా పార్టీలో జాయినైపోయారు. ఈ సారి గడి కూర్పరులలో ఆయన కూడా ఒకరు. ఇక స్లిప్పులెలా ఇస్తారో చూడాల్సిందే!! ఆ సంగతి మేం చూస్తాంగానీ, ఈ లోగా గడెలా ఉందో మీరో లుక్కెయ్యండి.

గత రెండు నెలల నుంచీ గడువు పొడిగించడం మూలంగా, ఈ నెల గడిని నెలాఖరుకి గాని సమర్పించలేకపోయాం. దారి తప్పుతున్న గడిని గాడిలో పెట్టాలిగా, అందుకని మేనెల గడికి రెండు వారాలే గడువు. సమాధానాలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ జూన్ 7.


Leave a Reply