అంతర్జాలంలో వ్యాపారీకరణ
అమెరికా జెండా పట్టుకుని ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి మీదకు దిగకముందే అక్కడ టీకొట్టు పెట్టిన అయ్యరు ఆర్మ్ స్ట్రాంగ్ కు టీ అమ్మడానికొచ్చాడంటుంది అంతర్జాలంలో ప్రాచుర్యంలో ఉన్న ఒక కార్టూను. మరి ఆ అయ్యరులాగే ఈ అంతర్జాలంలో నాలుగు డబ్బులు చేసుకునే మార్గాలేవి? ఆ మార్గాలెంట మనమెంత దూరం వెళ్లగలం? అని విశ్లేషిస్తున్నారు తెలుగు బ్లాగావరణంలో ఆబాలగోపాలానికీ పరిచితుడైన గార్లపాటి ప్రవీణ్.



