ఏడో చంద్రుడు
ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి పుట్టినరోజు (జూలై 30) సందర్భంగా రావిశాస్త్రి రచనా ప్రస్థానం గురించి పట్రాయని సుధారాణి గారి వ్యాసం సమర్పిస్తున్నాం, చూడండి
ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి పుట్టినరోజు (జూలై 30) సందర్భంగా రావిశాస్త్రి రచనా ప్రస్థానం గురించి పట్రాయని సుధారాణి గారి వ్యాసం సమర్పిస్తున్నాం, చూడండి
అలతి పదాలతోనే అక్షరాలను దృశ్యాలుగా ఆవిష్కరింపజేసే నేర్పున్న మూలా సుబ్రహ్మణ్యం గారు తనదైన శైలిలో పొద్దు కోసం మొదటిసారిగా పంపిన చిన్న కవితను చదవండి.
దాంతోపాటు కొడవటిగంటి కుటుంబరావు రష్యను భాష నుండి అనువదించిన నవల మృతజీవులు, పందొమ్మిదో భాగాన్ని కూడా ఆస్వాదించండి.
నిశ్శబ్దానికి మరోవైపు కథను ప్రచురించాం. కొల్లూరి సోమశంకర్ రచించిన ఈ కథ గ్రంథాలయ అధికారుల ఉద్యోగ విశేషాలను వివరిస్తుంది.
గతనెలలో రానారె కూర్చిన గడి సాధకులందరినీ ముప్పుతిప్పలు పెట్టింది. క్లిష్టమైన గడులు కూర్చిన నేర్పరులు సైతం ఆ గడిని చూసి, కూర్పరిని గురించి “వీడు సామాన్యుడు కాడు” అనేశారు. మరి ఆ గడిని ఎంతమంది పూరించి పంపారో పొద్దులో చూడండి. భైరవభట్ల కామేశ్వరరావు గారు సమతూకంతో కూర్చిన జూలై గడి సిద్ధంగా ఉంది. ఎప్పటిలాగే గడి గడువు వచ్చే నెల ఏడవ తేదీ.
విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కవిత Stray Birds కు ‘బ్లాగాడిస్తా’ రవి స్వేచ్ఛానువాదం స్వేచ్ఛావిహంగాలు పొద్దులో.
మనం పొందిన అనుభవాలనో, మనకు తెలిసిన సమాచారాన్నో, మనకు కలిగిన ఆలోచనలనో, అభిప్రాయాలనో స్థలకాలాల పరిమితులను దాటించి పదుగురితో పంచుకోవాలంటే వాటిని లిఖితరూపంలో పెట్టడమే ఉత్తమ మార్గం. లిపిని నేర్చుకోవడమే అక్షరాస్యతకు తొలిమెట్టు. కానీ లిపుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అలాంటి లిపుల గురించి మనకు తెలియని విశేషాలను వివరిస్తున్నారు కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు రాసినది చదవడం అనే వ్యాసంలో.
జూన్ నెలలో సామాజిక, రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉన్నట్టే, బ్లాగు వాతావరణం కూడా వేడిగానే ఉంది. టపాలు, వాటిలో చర్చలు కూడా వేడిగా వాడిగానే జరిగాయి. ఆ విశేషాలను కలగలిపిన వ్యాసం, పొద్దులో.