రాసినది చదవడం

మనం పొందిన అనుభవాలనో, మనకు తెలిసిన సమాచారాన్నో, మనకు కలిగిన ఆలోచనలనో, అభిప్రాయాలనో స్థలకాలాల పరిమితులను దాటించి పదుగురితో పంచుకోవాలంటే వాటిని లిఖితరూపంలో పెట్టడమే ఉత్తమ మార్గం. లిపిని నేర్చుకోవడమే అక్షరాస్యతకు తొలిమెట్టు. కానీ లిపుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అలాంటి లిపుల గురించి మనకు తెలియని విశేషాలను వివరిస్తున్నారు కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు రాసినది చదవడం అనే వ్యాసంలో.