Archive for the 'అతిథి' Category

పొద్దులో నెలవంక

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వెలిగించిన ‘నెలవంక’ (Crescent Moon) ను నేడు మరొక రవీంద్రులు తెలుగు నింగిలో ఆహ్లాదకరంగా వెలయించారు. ఆ వెన్నెల్లో మా పాఠకులు తడిసి ఆనందించగలరని భావిస్తున్నాం.

ఊకదంపుడు: “విషయం ఏమి లేకుండా ఇంతసేపు మాట్లాడటానికి .. ఇంత కన్నా మంచి పేరు లేదు - ఒక్క తెలుగు లోనే కాదు - మిగతా భాషల్లో కూడ…” అంటారు ఆ బ్లాగరి. ఆ పేరునే పెట్టుకుని మంచి మంచి జాబులను వెలయిస్తున్న ఊకదంపుడు బ్లాగును సమీక్షిస్తున్నారు, స్వాతికుమారి.

ప్రపంచీకరణ

తింటే గారెలే తినాలి
వింటే భారతమే వినాలి.
అప్పులు చేస్తే చంద్రబాబే చెయ్యాలి
ఆస్తులమ్మితే రాజశేఖరరెడ్డే అమ్మాలి

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికం గురించి కొణతం దిలీప్ చెబుతున్నారు చూడండి. ఒక దళారీ పశ్చాత్తాపం పుస్తకాన్ని అనువదించిన కొణతం దిలీప్ పొద్దుకు రాసిచ్చిన ప్రత్యేక వ్యాసం ఇది.

సాకలైవోరు

మీరు ఇసుకలో అక్షరాలు దిద్దుకుని నేర్చుకున్నారా? పిండిలో ఓనమాలు కాదు.. అక్షరాలన్నీ! ఇసుకలోనే!!

పోనీ లాంతరు, బుడ్లు తీసుకుని ప్రైవేటుకెళ్ళి చదువుకున్నారా? లేదా.. మీకా అదృష్టం లేదన్న మాట! పోన్లెండి!

సాకలైవోర్లు, కోమటి పంతుళ్ళు, పొలిమేర బళ్ళు,… ఇవన్నీ పోయాయి. ఇప్పుడన్నీ కాన్వెంటులూ, నేషనల్, ఇంటర్నేషనల్ స్కూళ్ళే! ఏడో తరగతి నుండే ఎమ్‌సెట్లు, ఆరో తరగతి నుండి ఐఐటీలు.

రాయలసీమలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఓ రైతు..

ఆగండాగండి.. కాదు, ఆయన కాదు! వీరి పేరు ఆదినారాయణరెడ్డి!

ఆదినారాయణరెడ్డి గారు రైతు బిడ్డే కాదు రైతు కూడా! తాను ఎలా చదువుకున్నారో చెబుతున్నారాయన. పొద్దులో గతంలో అహం అనే వ్యాసం రాసారు కూడా! పదండి ఆదినారాయణరెడ్డి గారి సాకలైవోరు చదువెలా చెప్పారో తెలుసుకుందాం.

వాగ్విలాసము

గద్యం రాసే అలవాటే లేదాయనకు! ఆయన బ్లాగు నిండా కమ్మటి పద్యాలే. పద్యాలకు చిరునామా ఆయన బ్లాగు. అలాంటి ముక్కు రాఘవ కిరణ్ చేత పంతం పట్టి గద్యం రాయించాం. ఓ పూర్తి నిడివి వ్యాసమే రాయించాం. మొత్తానికి అనుకున్నది సాధించాం గదా అనుకుని వ్యాసం చూద్దుం గదా.. ఆయన పద్య రచనాప్రస్థానమే ఆ వ్యాసం!

చిన్నతనంలోనే రాయడం మొదలుపెట్టిన రాఘవ, ఆ అనుభవాలను ఈ వ్యాసంలో నెమరు వేసుకుంటున్నారు. చదవండి.