గడి, కవిత
నవంబరు గడిని, అక్టోబరు గడి ఫలితాలనూ ప్రచురించాం. పింగళి శశిధర్ రచించిన కవిత దూరం కూడా ప్రచురించాం.
నవంబరు గడిని, అక్టోబరు గడి ఫలితాలనూ ప్రచురించాం. పింగళి శశిధర్ రచించిన కవిత దూరం కూడా ప్రచురించాం.
అక్టోబరు నెల గడిని, సెప్టెంబరు గడి ఫలితాలనూ ప్రచురించాం, జొరబడండి.
సమయానికి సెప్టెంబరు గడి అందుబాటులో లేక ప్రచురించలేక పోయాం. కొవ్వలి సత్యసాయి గారు అది సహించలేకపోయారు. వెంటనే ఓ గడి తయారు చేసి, దాన్ని ప్రచురించమని పంపించారు. వారికి పొద్దుపై గల అభిమానానికి నెనరులు తెలియజేసుకుంటూ, ఈ గడిని ప్రచురిస్తున్నాము. అక్టోబరు గడిని త్వరగా ప్రచురించి, గడిని మళ్ళీ గాడిలో పెట్టేందుకు గాను, ఈ గడికి గడువును అక్టోబరు 12 వ తేదీతో ముగిస్తున్నాం. కేవలం వారం రోజుల్లో పూర్తి చేసి పంపాలి కాబట్టి, ఇది మెరుపు గడి! సత్యసాయి గారు ఈ గడిలో మరో ప్రత్యేకతను కూర్చారు, పరిశీలించండి. ఈ గడిపై మీ అభిప్రాయాలను రాయండి.
అనివార్యమైన కారణాల వలన పొద్దులో ఈ నెల గడిని ప్రచురించలేకపోతున్నాం. వచ్చే నెల గడిని అక్టోబరు 13 న ప్రచురిస్తాము. గత నెల గడి ఫలితాలు వివరణలను ప్రచురించాం.
జాలంలో శ్రమదానం ఎలా చెయ్యొచ్చో పొద్దు సంపాదకుడు వీవెన్ తన సంపాదకీయంలో వివరిస్తున్నారు. స్వయంగా శ్రమదానవీరుడైన వీవెన్ శ్రమదానపు విలువను చెబుతున్నపుడు వినదగున్, పాటించదగున్!
దీంతోపాటు ఆగస్టు నెల గడిని కూడా ప్రచురించాం. అన్నట్టు, శ్రమదానం సంగతి మా గడి పూరకులకు చెప్పక్కరలేదు. చేపకు ఈదడం నేర్పాలా?
గడి గడువు దగ్గరపడుతోంది. ఇంకా పది పన్నెండు రోజులే ఉంది. సాధకులు ఇంకా ఆధారాలతో కుస్తీలు పడుతున్నట్టే ఉన్నారు. ఏంపర్లేదు, సుగాత్రి గారి బ్లాగుకెళ్తే ఆధారాలకు ఆధారాలు దొరుకుతాయి.
మామూలుగా గళ్ళనుడికట్టును సాధించేందుకు ఆధారాలిస్తారు. ఆ ఆధారాలను అర్థం చేసుకునేందుకు ఆధారాలు - అనగా స్లిప్పులు - ఇవ్వడం ఎక్కడన్నా చూసారా? అదుగో ఆ పని మొదలెట్టారు కొత్తపాళీ, సుగాత్రి గారలు. పదండి ముందుకంటూ తోసుకుపోతున్నారు, ఇతర గడి జ్వరపీడితులు. ఎవరికి తోచిన ఆధారాలు వాళ్ళిస్తూ దూసుకుపోతున్నారు. మచ్చుకో ఆధారం చూడండి.. “మనేకా గాంధీ గారి మొగుడి గారి పని” ఏంటో తెలిస్తే రెండో నాలుగో గళ్ళు నిండినట్టే!
మనేకా గాంధీ ఎవరా? -ఓవర్ టు సుగాత్రి గారి బ్లాగు!
“గడి సాధకుల బాధలేగాని, గడి కూర్పరుల సాధక బాధకాలు పట్టించుకోరా, మాకూ స్లిప్పులు కావాలి” అని మేం కొత్తపాళీగారి దగ్గర మారాం చేస్తే “దానికేం భాగ్యం, అలాగే కానివ్వండి” అంటూ ఆయన మా పార్టీలో జాయినైపోయారు. ఈ సారి గడి కూర్పరులలో ఆయన కూడా ఒకరు. ఇక స్లిప్పులెలా ఇస్తారో చూడాల్సిందే!! ఆ సంగతి మేం చూస్తాంగానీ, ఈ లోగా గడెలా ఉందో మీరో లుక్కెయ్యండి.
గత రెండు నెలల నుంచీ గడువు పొడిగించడం మూలంగా, ఈ నెల గడిని నెలాఖరుకి గాని సమర్పించలేకపోయాం. దారి తప్పుతున్న గడిని గాడిలో పెట్టాలిగా, అందుకని మేనెల గడికి రెండు వారాలే గడువు. సమాధానాలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ జూన్ 7.
నిన్నటి తొలికోడి మేలుకొలుపుకు స్పందించిన గడివీరులు కొందరు ఇప్పుడిప్పుడే కీబోర్డులు దులుపుతున్నారని తెలుగు సాహిత్యం బ్లాగులో ఈరోజు మొదలైన సందడి ద్వారా తెలుస్తోంది. గడువు పెంచితే బాగుండు అని కూడా సాధకులు కోరుకుంటున్నందువల్ల ఈ ఒక్కసారికీ గడి గడువును ఈ వారాంతం (మే 18 ) వరకు పొడిగించాలని నిర్ణయించాం. మామూలుగా ఏడో తేదీ న వెలువడే గడి మార్చి నెలలో గడువు పెంచడం వల్ల ఏప్రిల్ గడి 14వ తేదీన వెలువడింది. గడువు పొడిగింతల వల్ల గాడి తప్పిన గడిని తిరిగి 7వ తేదీకి రప్పించడానికి వీలుగా మే గడి గడువు ఎప్పటిలా నెలరోజులు కాకుండా మూడువారాలకు కుదించనున్నాం. ఇకనుంచి గడి పరిష్కారాలు పంపేవారు సకాలంలో పంపవలసిందిగా కోరుతున్నాం.
పందిని పొడిచిన వాడే బంటు
కందము రాసిన వాడే కవి
…
…
గడిని పూరించినవారే మొనగాళ్ళు
ఎవరా మొనగాళ్ళు? మాకు తెలియాలి!
రెండే రెండు రోజుల్లో!