Archive for the 'జాలవీక్షణం' Category

బ్లాగోళంలో భుగభుగలు

జూలై నెలలో తెలుగు బ్లాగుల్లో పెద్ద చిన్నా వివాదాలు బానే రేగాయి. పలు అంశాలపై వాడిగా చర్చలు జరిగాయి. వీటిని కొంతవరకైనా పట్టుకుని ఓ వ్యాసంలో బంధించే ప్రయత్నం చేసాం. ఈ విశేషాలను జూలైలో తెలుగు బ్లాగుల విశేషాలు వ్యాసంలో చూడండి.

అంతర్జాలంలో వ్యాపారీకరణ

అమెరికా జెండా పట్టుకుని  ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి మీదకు దిగకముందే అక్కడ టీకొట్టు పెట్టిన అయ్యరు ఆర్మ్ స్ట్రాంగ్ కు టీ అమ్మడానికొచ్చాడంటుంది అంతర్జాలంలో ప్రాచుర్యంలో ఉన్న ఒక కార్టూను. మరి ఆ అయ్యరులాగే ఈ అంతర్జాలంలో నాలుగు డబ్బులు చేసుకునే మార్గాలేవి? ఆ మార్గాలెంట మనమెంత దూరం వెళ్లగలం? అని విశ్లేషిస్తున్నారు తెలుగు బ్లాగావరణంలో ఆబాలగోపాలానికీ పరిచితుడైన గార్లపాటి ప్రవీణ్.