Archive for the 'పొద్దు' Category

చాసో స్ఫూర్తి అవార్డు

ప్రసిద్ధ తెలుగు కథకులు చాగంటి సోమయాజులు పేరుతో ఏర్పాటుచేసిన చాసో స్ఫూర్తి రాష్ట్ర అవార్డుకు ప్రముఖ కవి, కథా-నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఎంపికయ్యారు. ఈ అవార్డును జనవరి 17న విజయనగరంలోని లేడిస్‌ క్లబ్‌లో జరగనున్నసభలో అందుకుంటారు. ఈ సందర్భంగా పొద్దు ఆయనకు హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తోంది. ఈ మధ్యే విడుదలైన సన్నపురెడ్డి కథాసంపుటి కొత్త దుప్పటి లోని ఒక్కో కథపై స్వాతీ శ్రీపాద గారి విశ్లేషణా వ్యాసాలను ఇటీవలే మొదలుపెట్టాం. ఆ పరంపరలో భాగంగా నేర్చుకో కథపై విశ్లేషణను ఈరోజు అందిస్తున్నాం.

కందం నుడివినవాడే కవి..

ఉపజాతి పద్యాలు ధారావాహికలో నాలుగో భాగాన్ని ప్రచురించాం, చూడండి.

మృతజీవులు – 22

మృతజీవులు ఇరవైరెండో భాగాన్ని ప్రచురించాం, చూడండి.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటర్వ్యూ -1

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో పొద్దు సంపాదకులు జరిపిన ఇంటర్వ్యూ మొదటి భాగాన్ని ప్రచురించాం, ఆస్వాదించండి.

గడికి ఆలస్యమైంది.

అనివార్యమైన కారణాల వలన పొద్దులో ఈ నెల గడిని ప్రచురించలేకపోతున్నాం. వచ్చే నెల గడిని అక్టోబరు 13 న ప్రచురిస్తాము. గత నెల గడి ఫలితాలు వివరణలను ప్రచురించాం.

ఉపజాతి పద్యాలు -1

ముక్కు శ్రీరాఘవ కిరణ్ రాసిన “ఉపజాతి పద్యాలు” వ్యాసాల శ్రేణిలో మొదటి భాగాన్ని మీకు అందిస్తున్నాం.

లలితా ముఖర్జీ ఇక లేరు

ప్రముఖ కవయిత్రి లలితా ముఖర్జీ నిన్న (26 ఆగస్టు) మధ్యాహ్నం 3:10 కి క్యాన్సర్ తో మరణించారు. ఆమెకు పొద్దు నివాళి.

ఫ్రీగా వస్తే…

ఫ్రీగా వస్తేనే సాఫ్టువేరు వాడాలంటున్నారు పొద్దు సంపాదకవర్గ సభ్యుడు, వీవెన్. కానీ ఇక్కడ ఫ్రీ అంటే ఆ ఫ్రీ మాత్రమే కాదట.. అది “ఫ్రీ” అట! తికమక పెట్టామా? అయితే ఆ వ్యాసం చదవండి.
అలాగే స్వాతీ శ్రీపాద గారి మనసుకు చూపుంటే… కవిత కూడా మీకోసం.

గడి, స్వేచ్ఛావిహంగాలు

గతనెలలో రానారె కూర్చిన గడి సాధకులందరినీ ముప్పుతిప్పలు పెట్టింది. క్లిష్టమైన గడులు కూర్చిన నేర్పరులు సైతం ఆ గడిని చూసి, కూర్పరిని గురించి  “వీడు సామాన్యుడు కాడు” అనేశారు. మరి ఆ గడిని ఎంతమంది పూరించి పంపారో పొద్దులో చూడండి. భైరవభట్ల కామేశ్వరరావు గారు సమతూకంతో కూర్చిన జూలై గడి సిద్ధంగా ఉంది. ఎప్పటిలాగే గడి గడువు వచ్చే నెల ఏడవ తేదీ.

విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కవిత Stray Birds కు ‘బ్లాగాడిస్తా’ రవి స్వేచ్ఛానువాదం స్వేచ్ఛావిహంగాలు పొద్దులో.

రాసినది చదవడం

మనం పొందిన అనుభవాలనో, మనకు తెలిసిన సమాచారాన్నో, మనకు కలిగిన ఆలోచనలనో, అభిప్రాయాలనో స్థలకాలాల పరిమితులను దాటించి పదుగురితో పంచుకోవాలంటే వాటిని లిఖితరూపంలో పెట్టడమే ఉత్తమ మార్గం. లిపిని నేర్చుకోవడమే అక్షరాస్యతకు తొలిమెట్టు. కానీ లిపుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అలాంటి లిపుల గురించి మనకు తెలియని విశేషాలను వివరిస్తున్నారు కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు రాసినది చదవడం అనే వ్యాసంలో.