అక్టోబరు బ్లాగుల కథ యేమనగా..
సెప్టెంబరు నెలలో బ్లాగుల సింహావలోకనం ప్రచురించలేకపోయాం. ఈ శీర్షికను అభిమానించే పాఠకులు కొంత అసంతృప్తి చెందిన సంగతిని మేము గ్రహించాం. ఆపకండని కోరిన పాఠకులకు నెనరులు చెప్పుకుంటున్నాం. కేవలం అనివార్యమైన కారణాల వలన ఈ వ్యాసాన్ని తేలేకపోయామే తప్ప, మరో కారణం లేదని తెలియజేస్తూ, అక్టోబరు నెల బ్లాగుల ప్రస్థానాన్ని సమర్పిస్తున్నాం, చూడండి.



