Archive for the 'సమీక్ష' Category

మిట్టూరోడి సాహితీ సేద్యం

“నువ్వెన్నన్నా అను ప్రబల్ కన్నా! నాకు ముండమోపులంటే బలే యిష్టిం!” అన్నా.

“అవున్లే వాళ్లకైతే మొగుళ్లుండరు. ఇష్టమొచ్చినట్టు ఆడించొచ్చని నీ ప్లాను!” అనింది నన్ను జడతో వొకటి కొట్టి.

********** **********

పై సంభాషణ ఎక్కడిదో చూచాయగా కూడా గుర్తు పట్టలేకపోయారంటే తెలుగు సాహిత్యంలో మీరు ఒక విశిష్టమైన పార్శ్వాన్నింకా రుచి చూడలేదని అనుకోవలసివస్తుంది. అలివేలు మంగమ్మకొక దండం అనే కథలోని మాటలివి. మీరిదివరకే చదివుంటే, ఈనెల పొద్దు కథల విభాగంలో ప్రచురించాం, మళ్లీ చదవచ్చు.

ఈ నెల పుస్తక సమీక్ష విభాగంలో - ఇదే రచయిత వెలువరించిన జీవిత చిత్రణ మునికన్నడి సేద్యం నవల పరిచయాన్ని కూడా అందిస్తున్నాం.

అప్పుడేం జరిగిందంటే..

నవరసాల్లో హాస్యరసానిదో విశిష్ట స్థానం. అసలు రసరాజం హాస్యమేననేవాళ్ళూ ఉన్నారు. అలాగే బ్లాగులందు హాస్యబ్లాగులు వేరయా అని కూడా అనుకోవచ్చు. అలాంటి మేలైన హాస్యబ్లాగుల్లో ఎన్నదగినది “అప్పుడు ఏమి జరిగిందంటే..” అంటూ క్రాంతి “మేడం” రాసే క్రాంతిగాయం బ్లాగు. ఆ బ్లాగుపై పొద్దు సమీక్ష ఇదిగో

శశిశ్రీ కథల సమీక్ష

ప్రచురితమయ్యే ప్రతి పుస్తకమూ సాహిత్యానికో కానుక.
ప్రతి సిరాబొట్టూ కానేరదు వెయ్యి మెదళ్ల కదలిక.
అది పాఠకుల్లో కలిగించే కదలికే దాని విలువకో సూచిక.

“ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం, గమ్యస్థానం కూడా సమాజమే” అని నమ్మే శశిశ్రీ. తొలి కథాసంపుటి దహేజ్. ప్రధానంగా ముస్లిం జీవితాలను చిత్రించిన ఈ సంపుటిపై సమీక్షను, ఆ సంపుటిలోనించి అలికిడి అనే కథను పొద్దులో చదవండి.

సమూల వీక్షణ -సమీక్ష

స్థాలీపులాక న్యాయం అనే మాట వినే ఉంటారు. అన్నమంతా చూడకుండా ఒక మెతుకును పట్టి చూసినా సరిపోతుందనే సిద్ధాంతమది. మన పుస్తక సమీక్షకులు చాలా ఎక్కువగా వాడే మాట, ఆచరించే పద్ధతి అది. విమర్శకులు మాత్రం అలాక్కాదు.., చాలా కూలంకషంగా ప్రతి మెతుకునూ పట్టిపట్టి మరీ పరిశీలిస్తారు.

కలం కలలు అనే బ్లాగును చూపించి, దాన్ని సమీక్షించండి అని సాలభంజికలు నాగరాజు గారిని కోరాం. ఆయన ఆ బ్లాగును శీర్షం నుండి ఫుటరు దాకా గాలించి, బ్లాగరి శైలిని, రచనా దృక్పథాన్ని, తాత్వికతను ఒడిసి పట్టారు. ఈ ఎస్సెన్సునంతా ఆ బ్లాగరి ఫోటోతో జోడించి ఒక సమీక్ష (విమర్శ) వ్యాసం రాసిపెట్టారు. ఫణీంద్ర అనే బ్లాగరి గొడవ గురించి తెలిసికొనేందుకు కలంకలలు చూడాలి. ఫణీంద్ర గురించి తెలిసికొనేందుకు నాగరాజు గారి ఘలం ఘలలు చూడండి.

జాన్ హైడ్ కనుమూరి స్త్రీ సమస్యలపై వచ్చిన కవిత్వ సంకలనం సమీక్ష కూడా చదవండి.